Every story contain a lesson or give entertainment while reading. Written by: R. Sucharitha

Tuesday, February 15, 2011

My upcoming updating story captions

1. ఈ రాత్రి గడిస్తే చాలు ( ee rathri gadisthe chalu )
                              Some dangerous nights can't finish
                                                                 One should care of it.
2. Curfew ( కర్ఫ్యూ )
             Which we can't express in words.

3. వెంటాడే మృత్యువు (ventade mruthyuvu )
                               If death chases.

4.రాజకోట రహస్యం ( rajakota rahasyam )
                           Some secrets are very interestig.

5. Vayasuku pillalu manasuku peddalu ( publish in "vaarta" )
                                             Give a hand who is in..........

6. చేసిన తప్పు ( Chesina tappu )
                  Some times silly jokes push into dangerous position.


Hope I will update as soon as possible

Thank you
Readers

Tuesday, February 8, 2011

JAI TELANGANA ( poratam muddu , balidanam vaddu )జై తెలంగాణ (పోరాటం ముద్దు, బలిదానం వద్దు)

కుల, మత, భాష, లింగ, వయో భేదాలు లేకుండా అందరు కలిసి ఆనందగా , సంతోషంగా ఎవరి పని వారు చేసుకుంటున్నాం. ఇంతకి మాదేదో ఉమ్మడి కుటుంబం లేక  అనాధ శరణాలయమో కాదు. అతి విశాలమైన  స్థలం, మైదానం , నిజాం కట్టడాలు , బాస్కెట్ బాల్ గ్రౌండ్, కాంటీన్, వేళ్ళలో విద్యార్ధులు , నిష్ణాతులైన lecturers , సిటీ సెంటర్ లో కాలేజీ, అందుకే ఎంతో మంది మా కాలేజీ లో చదివే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది మాది నిజాం కాలేజీ అని.
ఇక cut చేస్తే అంటే story నీ open చేస్తే


కాంటీన్ దగ్గర బ్యాచులు బ్యాచులుగా కూర్చున్నారు,class లకు వెళ్ళని the great student batch.
విద్యార్థి : ఒరేయి డిసెంబర్ నుంచి semister exams  కదారా! నీ దగ్గర notes  ఉంటె ఇవ్వవ ఈ రోజు night out చేస్తాను.
(ఇదంతా పక్కన కూర్చున్న egg puff లాగిస్తున్న ఇంకో విధ్యర్హి బృందం లోని బాస్కర్ విని.)
బాస్కర్ : అరె మామ మనకి కనీసం notes  తీసుకోవల్లన్న ఆలోచన కూడా రాలేదు , ఒరేయ్ నీ దగ్గర ఉందా?
చందు: హా... హ. హ్హ. ఎంటిరా అరటి పండు ఒలిచి బత్తాయి తిన్నట్టు  ఆ.. అర్ధం లేని మాటలు.
నలిని : అబ్బ .. చ్చా.  notes  లేదు సరికదా ! పైనుంచి పిచ్చి పిచ్చి సామెతలు ఒకటి.
చందు : అది సర్లేకాని నలిని నీ దగ్గర అయిన ఉందా?
నలిని : ( కోపంగా చందు తింటున్న egg puff లాక్కొని ) కడుపుకు egg puff తింటున్నావా? chicken  puff తింట్టునావా? ( అని చిన్నగా నవ్వి, ఆ puff కూడా లాగించేసింది, నలిని కూడా రాయలేదని అర్ధమై అందరు నవ్వారు.)
విశ్వ : హ.హ. hey నేను వెళ్లి రాజు ని అడిగోస్తనుండు. ( అని రాజుని వెతుకుతు లైబ్రరీ మెట్లపై  dull గా కూర్చున్న రాజు చూసి ,దగ్గరికి వేళ్ళి )
విశ్వ:  రాజు...! ఏంటి? dull గా  ఉన్నావు?
రాజు: ఏం లేదు .......( కొంచెంసేపు మౌనంగా ఉండి ) , అవును మన తెలంగాణా వస్తుందంటావా?
విశ్వ : ఒరేయి ఎందుకురా? నీకు అ అనుమానం? అయిన సెమెస్టర్ ఎగ్జామ్స్ వస్తునాయి. ముందు దాని గురించి ఆలోచించు.
విశ్వ : అది సర్లేగాని, నీ దగ్గర  history notes ఉంటె ఇవ్వవా. (టక్కున ఏదో గుర్తుకు వచ్చినవాడిలా  నవ్వి) అయిన నీ దగ్గర  ఉండక పోవడం ఏంటి, సిన్సియర్ & రెగ్యులర్ స్టూడెంట్ వి కదా!
రాజు: అవును ( బాధగా) ఇదిగో ( అంటూ notes ఇచ్చిన  తర్వాత) మన తెలంగాణా వస్తుందంటావా? ( అని మళ్ళి అడిగాడు )
విశ్వ : (సమాధానం చెప్పకుండానే )thanks  రా copy చేసుకొని ఇస్తాను. (అని notes తిరగేస్తూ వెళ్తున్న అతనికి అందులో అంతకు ముందే రాజు రాసుకున్న సుసైడే లెటర్ చదివి నిర్గాతపోతడు, రాజుని నిలదీసి అడుగుదాం అనుకుంటాడు, కానీ అలా చేయడం వల్ల లాభం లేదని అని ఆలోచిస్తూ తిరిగి అ లెటర్ని అందులో పెట్టగానే , రాజు కంగారుగా ఊరికి వచ్చి notebook ని లాక్కొని లెటర్ నీ తీసుకొని ,notes తిరిగి విశ్వ చేతిలో పెట్టి హడావుడిగా)
రాజు: వస్తాను రా class కి time అయింది .
(విశ్వ కి  ఏమి మాట్లాడాలో  తెలియక అలాగే చూస్తూ .. .రాజుకి అనుమాన రాకుడదని చిన్నగా నవ్వి .)
విశ్వ : ఏంటి లవ్ లెటర్?.
( రాజు వైరాగ్యంగా హూం... అని నిట్టూర్చి , బాధగా వెళ్ళిపోతాడు.)


మరుసటి దినం
విశ్వ & అతని స్నేహితులు రాజు దగ్గరికి వెళ్లి.
బాస్కర్ : మేము campus కి వెళుతున్నాము, నువ్వు వస్తావా?
రాజు: ఎందుకు
చందు : మొన్న suicide చేసుకున్న యాదయ్య  స్నేహితుడు అలీని  కలవడానికి వెళుతున్నాము.
రాజు: సరే వస్తాను.


మన హైదరాబాద్ సిటి , మెట్రో సిటి అయిన తర్వాత కోల్పోయిన ప్రకృతి అందాలు అన్ని సిటి సెంటర్ లో ఉన్న ఉస్మానియా university కాంపస్ లో కనిపిస్తాయి.గుబురుగుబురు చెట్లు , కిల కిల రాగాలు తీస్తూ పిచ్చుకలు , అందమైన నిజాం కట్టడం అయిన ఆర్ట్స్ కాలేజీ పైన శ్రద్ధగా classలు  వింటున్న పావురాలు , ఫ్రెండ్స్ వస్తే సినిమా కి రాకపోతే క్లాసుకి వెళ్దాం అని బస్సు స్టాప్ లో ఎదురుచూస్తున్న విద్యార్ధి ,విద్యార్థినిలు .ట్రాఫిక్ జాం తక్కువున్న కాంపస్ రోడ్లపై రయి...రయి.. మంటూ వెళ్తునారు విశ్వ & గ్యాంగ్.


రాజు : ఎందుకు వెళ్తున్నారు.
చందు : పాపం వాడి స్నేహితుడు చనిపోయాకా, పలకరించలేదు అందుకే.


Tagore auditorium ఎదురుగ ఉన్న landscape గార్డెన్ ముందు బండి పార్క్ చేసి లోపలి వేళ్ళి , పార్క్ లో ఓ మూల చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న అలీని చూసి దగ్గరికి వేళ్ళి ఆప్యాయంగా హత్తుకొని, ఆ ప్రక్కనే ఉన్న బెంచిపై కూర్చుంటారు.


చందు : అసలు ఎలా జరిగిందిరా, ఎపుడు నవ్వుతు నవ్విస్తుండే వాడు , ఇలా సడన్ గా...

అలీ : (బాధగా )పాపం చాల పేదవాడు రా ,ఇలా క్షనికావేశంతో ప్చ్ ...
నలిని : అయిన educated అయ్యి ఉండి, ఇలా foolish గా ఆత్మహత్య చేసుకున్నాడు.
అలీ : ఉద్యమంలో  చాలా చురుగ్గా పాల్గొన్నాడు. కానీ రేపు, మాపు అంటుంటే ఇక వస్తుందో లోదో అని భయపడి, వాడి మరణంతోనైన తెలంగాణా తేవాలి అనుకున్నాడు అందుకే ( అంటూ ఏడ్చాడు ......)
చందు : ఉరుకోర...( అని తన కళ్ళలో వస్తున్న కన్నీటి ఆపుకుంటూ ) ఊరుకో ( అని భుజం తట్టాడు).
అలీ : ( కళ్ళు తుడుచుకుంటూ )లేదురా వాడు లేని లోటు తీరనిది క్లాసు లో , కాలేజీ లో , రూం ..అసలు నా లైఫ్ లోనే వాడిని మిస్ అయ్యాను అని తలుచుకుంటేనే బాధగా ఉందిరా. నా సంగతి వదిలేయి పాపం వాడి అమ్మానాన్నలని తలుచుకుంటే ఇంకా భాదేస్తుంది. వాడిది మా ఊరే మా ఇంటి పక్కనే వాడి ఇల్లు చినపట్నుంచి కలిసిపెరిగం, తిరిగాం . వాడి నాన్న పెద్ద వ్యవసాయదారుడు ,కాని వాడి చిన్నపుడే నీళ్ళు లేక , పొలం బిరుబడి పోవాడంతో  ఆర్దికంగా బాగా చిక్కి పోయారు, వాళ్ళ అమ్మకి పురిటి కర్చులకు  కూడా డబ్బులు లేకపోతె వాళ్ళ నాన్న కిడ్ని అమ్మి , ఆ డబ్బుతో హాస్పిటల్ పైసలు కట్టి వాడిని కన్నారు .వాడిని అల్లారుముద్దుగా కంటికి రెప్పల , ఎన్నో నోముల ఫలితంగా పుట్టిన బిడ్డ అంటూ , వాడె వారి ఆశగా ,జీవితంగా బ్రతికారు. ఎన్నో కష్టాలు పడ్డారు కాని ఆ కష్టనంత వాడిని చూస్తూ మర్చిపోయేవారు, " మేము ఎంత కష్టపడ్డ మా బిడ్డ కోసమే కదా " అనేది వాళ్ళ అమ్మ. వాడి తల్లి పాచి పని చేస్తూ , వల్ల నాన్న కూలి వెళ్తూ  వాడిని చదివిస్తున్నారు , ఎన్నోసార్లు వాడు పని చేస్తాను మీరు ఇంకేన్నలు నా కోసం కష్టపడతారు అంటే వద్దు బిడ్డ అనేవాళ్ళు . " మా కొడుకు పై చదువులు చదవాలి, దొరలగ బ్రతకాలి అయ్యా " అని ఎన్నోసార్లు  వాళ్ళ నాన్న నాకు చెప్తే " మీరు చూస్తూ ఉండండి వాడు చాల పైకి ఎదుగుతాడు , ఈ ఏడాది university top ten , వచ్చే ఏడాది university 1st వస్తాడు, మంచి ఉద్యోగం వస్తుంది, మీకు కష్టం ఉరికేపోదు " అన్నాను. వాడు కూడా ఎన్నోసార్లు నాతో " మా అమ్మకి నేనంటే ప్రాణం ఎపుడు నా గురించే ఆలోచిస్తూ ఆమె ఆరోగ్యం సంగతే మర్చి పోయింది.అమ్మని కంటి ఆసుపత్రిలో చూపించాలి , నాన్నకి మోకాళ్ళ నొప్పులు చూపించాలి. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలి" అనేవాడు. అలాంటి వాడు తొందరపాటు తనంతో ఈలాంటి నిర్ణయం తీసుకోని, సరిదిద్దుకోలేని అతి పెద్ద తప్పు చేసాడు. (కనిళ్ళని తుడుచుకుంటూ,నిబ్బరంగా ) నీకు తెలుసా వాడు చనిపోయడు అన్న వార్త వినగానే వాడి అమ్మ పిచ్చిది అయింది. మొన్ననే మానసిక వైద్యశాలలో వేసాము. (అని ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తుంటే, అందరు కలిసి ఓదార్చారు). ఈ రోజే ఆంటీ ని చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాలి.
నలిని : మేము వస్తాము పద .


ఆసుపత్రికి వేళ్ళి కౌంటర్లో యాదయ్య తల్లి ఎల్లమ్మ రూం నెంబర్ కనుకొని, ఆంటీ ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ జుట్టంతా విరబోసుకొని , ముడతబడ్డ బట్టలతో , ఒంట్లో ప్రాణం లేనంత బక్కగా బాగా ఏడ్చినట్టు కంటి కింద చారలు చాల దిన పరిస్తితిలో ఉంది. పక్కన ఎవరో ఉన్నటుగా  " వదిన మా కోడుకి అరిసెలు అంటే పాణం అందుకే చేస్తున్న(నెల మీదే అరిసెలు ఒత్తుతూ, గాల్లో వేసి కాలుస్తుంది ), పాపం బిడ్డ సదువుతుంటే తిండి ధ్యాసే ఉండదు " అని మొక్కం మీద పిచ్చిగా పడ్డ వెంట్రుకల్ని సిగ వేస్తూ ఏవేవో కొడుకు గురుంచి తనలోతాను మాట్లాడుకుంటూ, చెబుతూ పని చేసుకుంటుంది. అందరు గుమ్మం దగ్గరే నిల్చొని ఆమెని అలానే చూస్తూ నిలబడ్డారు.


నర్సు : జరగండి. (నర్సు చూడగానే భయంతో )
ఎల్లమ్మ: వద్దు.... వద్దు (అని గట్టిగ అరుస్తూ ) బిడ్డ నొప్పి పెడ్తుంది, సూది వద్దు.( పిచ్చిపిచ్చిగా ) కావాలంటే ఇదిగో ఓ అరిసె తీసుకో.( అని పక్కనే ఉన్న గుడ్డ ముక్కను అరిసె అనుకోని నర్సు చేతిలో పెట్టింది.నర్సు సుడి మందు ఇవ్వడానికి ఆమె అసలు సహకరించాట్లేదు, అప్పుడు అలీ కల్పించుకుంటూ)
అలీ : అమ్మ నువ్వు అలా సుది తిసుకోపోతే యాదయ్య చాలా భాద పడతాడు, నిన్ను చూడడానికి రాడు.
ఎల్లమ్మ :గట్లన అట్లయితే ఇయి బిడ్డ ( అని నవ్వుతు సూది వేయించుకుంది. అ తల్లి ప్రేమని చూస్తూ అనుకోకుండానే వాళ్ళ అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.) ఇపుడు చెప్పు నా కొడుకు ఎపుడోస్తన్నన్నాడు (అనగానే అలీ కట్లో నిల్లు తిరిగాయ), నువ్వెట్ల గున్నావ్ అయ్యా?
(అలీ ఏమి మాట్లాడలేక పొతే నలినే కాస్తంత సమయమైన ఆమెని సంతోష పెట్టాలని అనుకోని )
 నలిని :వస్తాడమ్మ తప్పకుండ..వస్తాడు, పరిక్షలు అయిపోగానే వస్తాడు ( అని దైర్యంగా చెప్పిన యాదయ్య ఇంకా ఎప్పటికి రాలేడని తెలిసి మనసులోనే భాద పడుతుంది )
ఎల్లమ్మ :నా కొడుకు బాగా సదువుతున్నాడ? పండక్కి దబ్బున రమ్మను , ఏలకి ఇంత బువ్వ తింటుండో లేదో " అని కొడుకు యోగక్షేమాల గురించి అడుగుతుంటే (అందరి గుండెలు తరుక్కు పోయాయి, రాజుకు వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి , మా అమ్మ ఇలాగె అయితే అన్న ఆలోచన రాగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక పోయాడు, ఇంకా నా కొడుకు వస్తాడు అని ఎదురుచూస్తున్న అ తల్లి ఆవేదన , ఆశ అన్ని కలలే అని తెలిసి అందరు మనసులోనే కుమిలిపోయారు.ఎల్లమ మెల్లగా మత్తులోకి జారుకుంది. అందరు అక్కడి నుంచి బరువైన హృదయంతో బయటికి వచ్చారు.)


వారం రోజుల తర్వాత
రూం లో suicide లెటర్ పెట్టి, ఓ కాగితంలో జై తెలంగాణా అని రాసుకొని జేబులో పెట్టుకొని. దేవుడి పటానికి మొక్కుకొని , అందరితో కలిసి టిఫిన్ చేసి, అందరికంటే ముందుగానే కాలేజీకి వేళ్ళి బిల్డింగ్ మీదకి ఎక్కి దూకడానికి సిద్దమయాడు ,కానీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ,అందరు గుర్తుకువస్తున్నారు, అయోమయంగానే బిల్డింగ్ చివరిదాకా వెళ్ళాడు.
బాస్కర్  : చావడానికి వచ్చావా?
( కంగారుగా వెనక్కి తిరిగి చూసాడు )
చందు : నీ చావుతో తెలంగాణా వస్తుందా?
రాజు:( ఏడుస్తూ ) వస్తుంది.
విశ్వ : వెళ్ళరా ( వరుసగా చచ్చిన వాళ్ళ పేర్లు చెబుతూ ) వీళ్ళందరూ చచ్చినందుకు తెలంగాణా వచ్చిందా?
పోనీ ఇప్పుడు  నువ్వు చస్తే వస్తుందా?
రాజు: లేదు నీకు తెలిదు, ఈ ఉద్యమం ఆగకుడదు అందుకే. ( రాజు మాటని పూర్తి అవకుండానే , కోపంగా )
విశ్వ : ఒరేయి నీలాంటి వాళ్ళు చస్తే ఉద్యమం రాదురా, నీలాంటి వాళ్ళు బ్రతికి పోరాడితే వస్తుంది.
బాస్కర్  : అయిన నీ చావుతో వచ్చే తెలంగాణ మా కొద్దురా. ( అని నికచ్చగా చెపాడు )
నలిని : ( convinence గా ) నువ్వే చూసావు కదా! యాదయ్య  చనిపోతే వాళ్ళ అమ్మ ఎలా పిచ్చిది అయిపోయిందో, నువ్వు కూడా మీ అమ్మకి కడుపుశోకం మిగిలిదమనుకుంటున్నావా? ఆమె ప్రాణం పన్నంగా పెట్టి నీకు ప్రాణం పోసింది ఇందుకేనా , ఇలా నీ జీవితం అర్దాంతరంగా ఆగిపోవడనికేన? (రాజు మనుసు కల్లుక్కుమంది )
విశ్వ : తెలంగాణా రోషాల గడ్డరా. భిక్షం ఎత్తి అడుకున్నట్టు, చస్తానని బెదిరించి తెచ్చుకోవడం కాదు, పౌరుషంతో పోరాడి తెచ్చుకుందాం. అసలు మన గడ్డపై ఇంత వరకు పిరికి పందల చచ్చిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా? కొమరంభీం ,చాకలి ఎల్లమ్మ ,రాణి రుద్రమ్మ, మాదిగా ముత్తమ్మ, గొల్ల సత్తమ్మ, ఆరుట్ల కమలాదేవి, సర్వాయి పాపన్న, బందగి, దొడ్డి కొమరయ్య లాంటి మహామహులు పుట్టిన గడ్దర ఇది. నీలా పిరికితనంగా ఆలోచించి ఉంటె వాళ్ళు ఈరోజు ఇలా ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలేచేవారు కాదు, ఎంతో మంది మేలు జరిగి ఉండేది కాదు. కష్టాన్ని చూసి పిరికివారిల తప్పించుకోకుండ ఎదురు తిరిగి పోరాడిన సమర యోధులు అందుకే చరిత్రలో నిలిచి పోయారు.కాని నీల ఆత్మహత్య చేసుకొలేదు.
చందు :ఎలాగో చనిపోవాలని నిర్ణయించుకున్నావ్ కదా , అలాంటపుడు  నీ చివరి శ్వాస వరకు దర్జాగా పదిమంది చూసి గర్వించేలా పోరాడి చనిపో.. ఇలా పిరికి వాడిలా ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా చనిపోవడం ఎందుకు.
విశ్వ :(నిరుత్సాహంగా )నీలాంటి వాళ్ళు ఇలా చేయబట్టే డిసెంబర్ వస్తుందంటే, ఊర్లో ఉన్న తల్లితండ్రులు గుప్పిట్లో  గుండెను పెట్టుకొని బ్రతుకుతున్నారు.(ఏడుస్తూ)సంక్రాంతి కొత్త పంట వస్తుంది, కాని మా కొడుకు వస్తాడా, మా కూతురు వస్తుందా! అని తెలియక " మా చిడ్డ క్షేమంగా ఉండాల" అని రోజు దేవుడిని మొక్కుతున్నారు.
మా బిడ్డ ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతారు అని దూరమైన, వారి ఆర్తిధిక స్థితికి బారమైన ఇంత దురం పంపించి చదివిస్తున్నారు. కాని ఇలా తిరిగి రాని లోకానికి, ఇంత దూరంగా వెళ్తే...వాళ్ళు ఏమైపోతారు, ఒక్కసారైనా ఆలోచించావా? అక్క, చెల్లి, తమ్ముడు (దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి) స్నేహితులం ...మేము ఏమైం పోతంరా . (అని బాధగా అడిగి , ఒక్క క్షణం ఆగి ) అయిన సమస్యలని పరిష్కార దిశగా ఆలోచించాలి, కానీ సమస్యను సమస్యగానే వదిలేసి, మరో సమస్యకి కారణం అయ్యి, జివితతం మాకు దుఖాన్ని మిగిల్చేల ఆలోచించవద్దు.
చందు : ప్లీజ్ రా. మా గురుంచి కూడా ఆలోచించండి ( అని వేడుకోలుగా అడుగుతూ ) దయచేసి నిన్ను అనాధ కాకుండా పెంచిన నీ తల్లితండ్రులను అనాధలు చేసి వెళ్ళకురా.( రాజుకి యాదయ్య ఆత్మహత్య చేసుకోవడం వల్ల పిచ్చిదైన ఎల్లమ్మ, అలీ గుర్తుకువచ్చి .రేపు నేను ఆత్మహత్య చేసుకుంటే నా తల్లితండ్రులు అనాదాలవుతారు అనిపించింది. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశలు అడియశాలవుతాయి,అవును వీళ్ళు చెప్పేది వాస్తవం అనుకోని )
రాజు: మీరు చెప్పేది నిజమే కాని ( ఏడుస్తూ ...)  తెలంగాణా. ( విశ్వ రాజు కన్నీళ్ళు తుడుస్తూ )
విశ్వ : కలిసి పోరాడదం ,దానికున్న ప్రతిబంధకాల్ని చెధిద్దం. అయిన బ్రతికి సాదించలేనిది , చచ్చిపోయి ఎలా సాదిస్తం చెప్పు ( అనగానే రాజు విశ్వని గట్టిగ హత్తుకొని, గుండెలోని బారం తిరిపోయేల ఏడ్చి,అతను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో తెలిసొచ్చి సిగ్గుతో తలదించుకున్నాడు.)
బాస్కర్ : ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాల సంతోషంగా ఉంది ( అంటూ రాజులో వచ్చిన మార్పుకు అందరు ఆనందంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు) (నలిని,చందు, బాస్కర్  ఆ రోజు విశ్వ రాజు suicide లెటర్ చదివిన విషయం మాకు చెబితే , మేము వాడి అమ్మానాన్నలకి ఈ సంగతి చెబుదాం అంటే , వద్దని మమ్మల్ని వారించి)
---------->>>>
విశ్వ : " అలా చేయడం వల్ల అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు, కాలేజీకి పంపారు , ఇంకెక్కడికి పంపించాలన్న భయపడతారు. అయిన ఇరవై నాలుగు గంటలు కాపలకాయడం కష్టం, ఆత్మహత్య చేసుకోవద్దు, అది తప్పు అని వాడికి తెలిసి రావాలి ,లేకపోతె ఎప్పుడు ఏం చేసుకుంటాడు అనేది  ఎవరు చెప్పలేరు, అసలు వాడిలో మార్పు రావాలంటే చనిపోవడం తప్పు అని, బిడ్డ చనిపోతే తల్లితండ్రులు పడే వేదన, మనస్తాపం. మానసికంగా క్రుంగిపోయే బందువుల , స్నేహితుల పరిస్తితి  అర్ధమయ్యేలా , యదర్దంగా చూపించాలి." (అని మాకు చెప్పి కావాలనే రాజుని ఆ రోజు కాంపస్ కి తీసుకుపోయాడు.)
(అలా వాడిలో సరైన మార్పు తీసుకొచ్చాడు " నీ ఆలోచన సరైంది విశ్వ! you had done a good job" అని మనసులో అనుకోని విస్వలాంటి వాడు స్నేహితుడు అయినందుకు గర్వంగా feel అవుతూ ముగ్గురు విశ్వకి సాల్యూట్ చేసారు)


కొన్ని రోజుల తర్వాత
ఉద్యమం ఉద్రుతమైంది , తెలంగాణ ప్రజలంతా ఉరుఉర నిరహరదిక్షలు , రిలేలు , పెన్ డౌన్లు మొదలైన పనులు చేస్తూ నిరసన తెలియచేస్తూ, తెలంగాణా కోసం పోరాడుతున్నారు.
మా కాలేజీ కూడా తెలంగాణా బ్యానర్ లతో, ముగ్గులతో, పాటలతో నిండిపోయింది .ఒక్కపుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్న రాజు చురుకుగా ఉద్యమంలో పాల్గొంటూ , తెలంగాణా సాధన ఎలా సాధ్యమో , అసలు తెలంగాణా రాష్టం ఎందుకో కావాలో ప్రజలకి అర్ధమయ్యేలా ఆవగాహన కలిపిస్తు, ప్రజలలో ఉన్న అవాస్తపు అపోహలను, భ్రమలను పోగ్గేటేల ఉపన్యాసాలు ఇస్తూ, అతని ఉనికిని చాటుకుంటూ , ఇంకో పదిమందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు.                                                                                            
                      నా ప్రియమైన విద్యర్తివిద్యర్తినిలు ఆత్మహత్యలు వద్దు.....please  
                      DO or DIE is out dated proverb , DO UNTILL YOU DIE  is present trend.
                                                             ఇంతకీ నేనొవరో చెప్పలేదు కాదు , నేను ఈ కథ రచయిత్రిని
                                                
                                                                                             R.సుచరిత
                                                                          M.A. THEATRE ARTS ( Final year )
                                                                                    NIZAM COLLEGE    








Published in NIZAMIAN magazine 2010-2011 

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

Followers

Total Pageviews