Dr. సుచరిత రామానుజపురం (Ph.D. Theatre arts) Actress &Director సూచించినవి
ఏ విషయానైన , సమాచారానైన తెలియజేసేది మరియు ప్రభావితం చేసేది MEDIA అందులో శక్తివంతమైనది ప్రింట్ మీడియా మరియు సినిమా మీడియా. ఇపుడున్న వ్యవస్థలో వీటి వాళ్ళ మహిళలకు జరుగుతున్న కీడుని నిరోధించి , వారి అభివ్రుధిని కాంక్షిస్తూ కొన్ని సూచనలు మరియు చట్టలో ఉన్న వాటికీ చేయవలసిన సవరణలను క్రింద ప్రతిపాదించాను.
సినిమా దాని ప్రభావం:
సినిమా దాని ప్రభావం:
కథనాయిక అంటే కథకి నాయిక . కానీ ఈ రోజుల్లో కథానాయకుడి చుట్టూ తిరగడమే కథానాయిక అన్నట్టుగా నిర్మిస్తున్నారు . skin show and dance కి మాత్రమే పరిమితం చేస్తున్నారు . అసలు సృష్టికి మూలం స్త్రీ. అలాంటి స్త్రీకి ఆలోచన శక్తి లేనట్టు చూపిస్తున్నారు. శక్తి స్వరూపం అయినా స్త్రీని నిస్సహాయురాలిగా, హీరోను ప్రేమించడమే తప్ప మరో లక్ష్యం ఏమి లేనట్టుగా నిర్మిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి చిత్రాలలో స్త్రీల పాత్రల చిత్రీకరణపై చర్చించే అంశాలు ఇంకా కొకొల్లలుగా ఉన్నాయి.
1. మహిళలకు ఉచితంగా నటన, దర్శకత్వం మరియు సినిమాకు సంబంధించిన ఇతర శాఖలలో శిక్షణ ఇవ్వాలి . దానివల్ల మహిళలకు సంబంధించిన అంశాలను, వివక్ష లాంటి వాటిని శ్రద్ధగా గమనించి దానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవచ్చు .
2. మహిళలకు సంబంధించిన చిత్రాలను ప్రభుత్వమే నిర్మించాలి .
3. మహిళలకు సంబందించిన చిత్రాలను నిర్మించే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి .
4. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లాగే women's film festival నిర్వహించాలి .
5. మహిళల పై జరిగే ఆకృత్యాలను అరికట్టే విధంగా school & colleges లో స్త్రీని గౌరవించే విధంగా లఘు చిత్రాలను నిర్మించి ప్రదర్శించాలి . అలాగే software company etc. లలో ప్రదర్శించాలి .
6. మహిళలకు సంబంధించిన కథాంశంతో మహిళలు నిర్మించే చిత్రాలకు సబ్సిడీ ఇవ్వాలి లేదా నిర్మాణానికి అవసరమయ్యే పరికరాలపై తగ్గింపు ఇవ్వాలి. కనీసం నిర్మాణానికి ఖర్చు అయ్యే మొత్తంలో 50% ప్రభుత్వం భరించాలి .
7. ముఖ్యమైన మహిళ చిత్రాలపై వినోదపు పన్ను మినహాయించాలి.
8. ముఖ్యమైన మహిళ చిత్రాలను ప్రదర్శించుటకు ప్రదర్శన శాలలు / theatresని కేటాయించాలి , అవసరమైతే థియేటర్ ని నిర్మించాలి .
9. స్వయంప్రతిపత్తి & స్వయంపోశక స్థితితో మనగలిగే మహిళా ఫిల్మ్ charitable ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, దానికై పూర్తిస్థాయి చిత్రాన్ని నిర్మించగల సామర్ధ్యం గల స్టూడియోని నిర్మించాలి, అలాగే కళాకారిణిల పోషణకై, పూర్వపు దేవాలయ మాన్యపు భూములు వలె ఈ ట్రస్ట్ కి కూడా తగినన్ని భూములను కేటాయించాలి.
9. స్వయంప్రతిపత్తి & స్వయంపోశక స్థితితో మనగలిగే మహిళా ఫిల్మ్ charitable ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, దానికై పూర్తిస్థాయి చిత్రాన్ని నిర్మించగల సామర్ధ్యం గల స్టూడియోని నిర్మించాలి, అలాగే కళాకారిణిల పోషణకై, పూర్వపు దేవాలయ మాన్యపు భూములు వలె ఈ ట్రస్ట్ కి కూడా తగినన్ని భూములను కేటాయించాలి.
10. School, college &University లలో Sports Section ఉన్నట్టు Culture Section కూడా కచితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ( సంగీతం, నృత్యం , నాటకం ప్రజలపై ఎంతో ప్రభావితం చూపిస్తాయి. దీనికి చరిత్రలో ఎన్నో సాక్షాలు కూడా ఉన్నాయి. అలాగే ఇది మానసిక ఎదుగుదలకి, సామాజిక సృహకి మరియు లోక జ్ఞానానికి ఎంతోగానో తోడ్పడుతుంది. )
11. Theatre Arts లో M.A. / M.P.A. , M.Phil & Ph.D. చేసిన students కి ముఖ్యంగా విధ్యార్థిణిలకు School, college & University లోని Culture Section లో ఉపాధి అవకాశం కల్పించాలి.
12. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో Theatre Arts చదివిన విధ్యార్థిణిలకు అవకాశం కలిగించాలి.
13. లలితకళలు చదువుతున్న విధ్యార్థిణిలకు ప్రతినెల scholarship/ fellowship ని ప్రభుత్వం అందించాలి. ( సంగీతం , నృత్యం, శిల్పకళ, చిత్రకళ మరియు నాటకం లాంటివి నేరుచుకునే విధ్యార్థిణిలకు ఇతర courses చేసే వాళ్ళల ప్రోత్సాహకాలు ఉండవు. కారణాలు అనేకం అందులో ముఖ్యంగా ఉపాధి అవకాశం లేక పోవడం. అందుకే వారికీ ఆర్ధిక సహాయం చేయాలి. )
14. సినిమాలు చూసి ప్రజలు అందులో youth త్వరగా ప్రభావితం చెందుతారు అన్న విషయాన్నీ అందరు ఒప్పుకొని తీరాల్సిందే . ( అతడు సినిమా చూసి B.Tech విద్యార్థి దొంగతనాని పాల్పడడం, ఖడ్గం సినిమా చూసి ఓ పిల్లవాడు అతని తోటి బాలుడి గొంతుని బ్లేడ్ తో కోసాడు , bollywood సినిమా చూసి దొంగతనాలకి పాల్పడిన ఉదంతం ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ) ఇపుడు పెట్టుబడిదారులు కేవలం లాభాపేక్ష తో వారు ఇష్టం వచ్చినట్టు సినిమాలో అమ్మాయిలను అంగడి బొమ్మల చూపిస్తూనారు , శృంగార ప్రేరకమైన దృశ్యాలు చూపిస్తున్నారు దీనివల్ల అమ్మాయిలపై అఘత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి . కొంతమంది porngraphy కి కూడా గురి అవుతున్నారు.
15. మణిపురి లో Bollywood సినిమాల పై నిషేధం విధించారు. ( వారి చట్టం ఎంత పటిష్టంగా ఉందంటే చివరికి భారతదేశానికే పేరు తెచ్చిన 3 times ఒలింపిక్ చాంపియన్ Marykom స్వీయ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన Marykom సినిమాని కూడా విడుదల చేయలేదు. ) కారణాలు సహేతుకమ? ఆహేతుకమా అనేది అనవసరం . ఒక రాష్ట ప్రభుత్వానికి ఇలాంటి వాటిని నిషేధించే అధికారం ఉంది. కావున మన తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమాలపై నిషేధం విధించే అధికారం ఉందని తెలుస్తుంది . కనుక కేవలం లాభాపేక్షతో మరియు డబ్బు & అధికారం తో ప్రజలను తప్పు దోవ పట్టించే సినిమాలు , యువతను తప్పుదోవ పట్టిచే సినిమాలు మితిమీరిన sex, violence and crime తో నిర్మించే చిత్రాలను, ముఖ్యంగా మహిళల అంగాంగ ప్రదర్శన, చుంభన మరియు అశ్లీల ప్రదర్శనే కథాంశంగా తెరకేకించే అశ్లీల చిత్రాలను నిషేధించాలి.
16. మహిళలు ఆర్ధికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి, చిత్ర నిర్మాణంలోని ప్రతిశాఖలో మహిళలకు ఉచితంగా కార్డు ఇవ్వాలి.
ప్రింట్ మీడియా మరియు ప్రకటనల ప్రభావం:
శ్రీశ్రీ గారు " కుక్క పిల్ల ,సబ్బుబిళ్ళ , అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం " అన్నట్టు. చాక్లెట్ ప్రకటకైన , పళ్ళు తోముకొనే పేస్టు అయిన , సెంట్ అయిన కాదేది మహిళా అంగాంగ ప్రదర్శనకు అనర్హం అన్నట్టు తీస్తున్నారు/ చిత్రిస్తున్నారు నేటి ప్రకటన కర్తలు.
న్యూస్ పేపర్ లో, హోర్డింగ్స్ లో, ప్రకటనలలో మహిళలను కురచ దుస్తులలో చూపుతూనారు, వివిధ భంగిమలతో యువతను రెచ్చగొట్టే విధంగా చిత్రిస్తున్నారు.
సీరియల్ :
స్త్రీ అంటే ప్రేమ స్వరూపం అని అంటారు, కాని నేటి సీరియల్స్ లో విలన్ లుగా చిత్రిస్తునారు, స్త్రీ అంటే అన్ని ఉన్న సమస్య సృషించే సుర్పణక లాంటి పాత్రలే చుపిస్థునారు. ఇంట్లో ఉండే గృహినిలను ఇంకా మజ్జుగా తయారు చేస్తున్నారు, అర్ధం పర్ధంలేని అభిప్రాయాలూ ఏర్పడేలా చేస్తున్నారు.
1. ప్రింట్ మీడియా , ప్రకటనలో మరియు సీరియల్ లో నిర్మాణ విభాగం లో ఉదా : దర్శకత్వం, రచన మొదలైన వాటిలో మహిళలు 50% నియమించాలి, ఉద్యోగంలో భర్తీ చేయాలి .
A . శ్రీదేవిగారు సూచించినవి
న్యూస్ పేపర్ లో, హోర్డింగ్స్ లో, ప్రకటనలలో మహిళలను కురచ దుస్తులలో చూపుతూనారు, వివిధ భంగిమలతో యువతను రెచ్చగొట్టే విధంగా చిత్రిస్తున్నారు.
సీరియల్ :
స్త్రీ అంటే ప్రేమ స్వరూపం అని అంటారు, కాని నేటి సీరియల్స్ లో విలన్ లుగా చిత్రిస్తునారు, స్త్రీ అంటే అన్ని ఉన్న సమస్య సృషించే సుర్పణక లాంటి పాత్రలే చుపిస్థునారు. ఇంట్లో ఉండే గృహినిలను ఇంకా మజ్జుగా తయారు చేస్తున్నారు, అర్ధం పర్ధంలేని అభిప్రాయాలూ ఏర్పడేలా చేస్తున్నారు.
1. ప్రింట్ మీడియా , ప్రకటనలో మరియు సీరియల్ లో నిర్మాణ విభాగం లో ఉదా : దర్శకత్వం, రచన మొదలైన వాటిలో మహిళలు 50% నియమించాలి, ఉద్యోగంలో భర్తీ చేయాలి .
A . శ్రీదేవిగారు సూచించినవి
1. అసంగటిత మహిళల కేంద్రాల వద్ద, అక్కడి స్థానిక సమస్యలపై లఘు చిత్రాలను నిర్మించాలి.
2. school & colleges, software company, అసంగటిత మహిళల కేంద్రాలు etc. వద్ద మహిళలను educate చేసే, వారిలో social, సెల్ఫ్-employeement లాంటి వాటిపై awareness create చేసే లఘు చిత్రాలను నిర్మించాలి.