Every story contain a lesson or give entertainment while reading. Written by: R. Sucharitha

Tuesday, May 5, 2020

paalu kalthoyi.... neellu kalthoyi - పాలు కల్తోయి ..... నీళ్ళు కల్తోయి

పాలు కల్తోయి ..... నీళ్ళు కల్తోయి
లాభాపేక్షమెండోయి
అందుకే సరుకులన్ని  కల్తోయ్

ప్రజా క్షేమమే మా లక్ష్యమని చాటోయ్
పదవులన్ని బంధువులకే అందునోయ్ 
అడుగులకే మడుగులొత్తే వారికే అధికారముండోయి
అధికార వ్యామోహం నిండోయ్
అందుకే రాజకీయం కల్తోయ్

స్వకార్యం తీర్చు స్వాములకేనోయ్
సంపాదకీయాలన్ని సపోర్టిచ్చోయ్
అవకాశవాదం మెండోయ్
అందుకే కొన్ని పత్రికలు కల్తోయ్

నోటుకే మనవోటు కాదోయ్
నీతికి నిజముగా వెయ్యవోయ్

స్వబుద్ధి సుబుద్ధి పరబుద్ధి వినాశం
గురుబుద్ది శ్రేష్ఠమోయ్
బోధిస్తున్నా గురువుగా....
అర్థిస్తున్నా కవిగా.... ఆలోచించమని....
ఇది మాత్రం కల్తీలేని నిజమోయ్                           - డా. ఆర్. సుచరిత 

About Me

My photo
Dr. Sucharitha Ph.D. Theatre arts Actress Director Dancer Violinist

Followers

Total Pageviews