Dr. R. Sucharitha జన్మభూమి
Janmabhoomi
రాజేష్ హైదరాబాద్ లోని హాస్టల్ ఉంటూ బి.ఎ. చదువుకుంటున్నాడు.
కాలేజి లాస్ట్ పీరియడ్ లో ప్రిన్సిపాల్ వచ్చి “రేపటి నుండి పది రోజులు వరకు సంక్రాంతి సెలవులు” అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు.
రాజేష్ చాలా సంతోషంగా అదే రోజు సాయంత్రం తన ఊరికి వెళ్ళడం కోసం బస్ స్టాప్ కు వెళ్లి బస్ కోసం ఎదురు చూడసాగాడు.
రాజేష్ తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేసుకుని...
“ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ బస్ ఆపుతామని రాసి ఉంటుంది. కాని అసలు బస్ స్టాప్ లోనే ఆగడం లేదు” అని బస్ స్టాప్ లో ఆగకుండా ముందుకెళ్ళి ఆగుతున్న బస్ ను ప్రక్కనున్న వ్యక్తికి చూపాడు రాజేష్.
“అంతేనా మెట్రో లైనర్ బస్ లో దిగేవారు దిగిన తర్వాత ఎక్కేవారు ఎక్కిన తర్వాత ఎవరూ పడి పోకుండా ఉండడానికి డోర్ పెడితే, ఆర్టీసీ వాళ్ళు మాత్రం దిగేవారు దిగకుండానే డోర్ పెడుతున్నారు. ఒక్కోసారి దిగేవాళ్ళు డోర్ లో ఇరుకుంటున్నారు కూడా!” బస్సు వచ్చే వైపు అసహనంగా చూస్తూ రాజేష్ తో అన్నాడు ప్రక్కనున్న వ్యక్తి.
రాజేష్ ఎక్కాల్సిన బస్సు రావడంతో
బస్సు ఎక్కి JBS బస్ స్టాప్ కి చేరుకున్నాడు. అప్పటికే
అక్కడ రఘునాథ్ పల్లి బస్సు కదలడానికి సిద్దంగా ఉంది. రఘునాథ్ పల్లి అదే ఆఖరు బస్సు
అవడంతో అందరు ఒకరినొకరు తోసుకుంటూ బస్సులోకి ఎక్కుతున్నారు. రాజేష్ అతి కష్టం మీద విండో
పక్కన సీటు సంపాదించుకుని కూర్చున్నాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చానా వాడిలా తన
షర్టు జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి, విప్పాడు. అందులో ఉన్న ముక్కుపుడక చూశాడు.
అంతే...
తన ఆలోచనలు క్రితం ఏడాది సంక్రాంతిని గుర్తుచేశాయి.
*****
రాజేష్ సెలవులకని ఊరొచ్చి బస్సు దిగుతుండగానే అతడి చిన్ననాటి స్నేహితులు రంగడు, కృష్ణ ఎదురుగా వచ్చారు.
“బాగున్నావా” అంటూ రాజేష్ కుడి చేతిలోని సూట్ కేస్ ను రంగడు తీసుకున్నాడు.
“నీ కోసమే ఎదురుచూస్తున్నాం...” అంటూ కృష్ణ రాజేష్ ఎడమ చేతిలోని బ్యాగ్ ను తీసుకున్నాడు.
“అంతా బాగున్నారా” అడుగుతూ ఊరు వైపు అడుగేశాడు రాజేష్.

“మేమంతా బాగానే ఉన్నావు” బదులిచ్చాడు
రంగా.
“నీకో విషయం తెలుసా. మన రంగాకి ఆ
పిచ్చయ్య కూతురు మల్లికి పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయం నీకు చెబుదాము అనేలోగా
నువ్వే వచ్చేశావు” చెప్పాడు కృష్ణ.
అప్పటికే రంగా సిగ్గుపడడం
ప్రారంభించాడు. అది గమనించిన రాజేష్ “అబ్బ ఎంత ముద్దుగా సిగ్గు పడుతున్నావురా”
అంటూ రంగాకి చెక్కిలి గింతలు పెట్టాడు.
దారిలో అందరు రాజేష్ ని కుశల ప్రశ్నలు వేయవేసారు ఊరి వాళ్ళు.
దారిలో అందరు రాజేష్ ని కుశల ప్రశ్నలు వేయవేసారు ఊరి వాళ్ళు.
పొయ్యి దగ్గర గొట్టం ఊదుతున్న కనకమ్మ రాజేష్ రావడాన్ని గమనించి గొట్టం కింద పెట్టి “బాబు రాజేష్ ఎలా ఉన్నావు?” అడిగింది రాజేష్ అమ్మ కనకమ్మ.
“నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు?” అడిగాడు రాజేష్.
“మాకేంటయ్య మేము బాగానే ఉన్నాం” అంటూ తన రెండు చేతులతో రాజేష్ ను ఆప్యాయంగ్గా
పట్టుకొని “నా రాత్నాల కొండ” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి “రా అయ్యా నీకిష్టమైన సర్వపిండి,
సకినాలు చేశాను” అంటూ ఆ పిండి పదార్ధాలు ఉన్న డబ్బా తీసి రాజేష్ కి తినిపిస్తుంది.
“అంతా నీ కొడుక్కేనా మాకేమైనా ఉందా?” అడిగాడు కృష్ణ.
“ఎందుకు లేదు” అంటూ వాళ్ళకి చెరో పల్లంలో పెట్టి వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టింది కనకమ్మ.
“ఇంకా చాలమ్మా నువ్వు తిను” అంటూ సకినం అమ్మ నోట్లో పెట్టాడు రాజేష్.
బయటి నుంచి వీళ్ళిద్దరి ఆప్యాయతను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి రాజేష్ నాన్న రంగయ్యకి.
రంగయ్యను చూసి “ఎప్పుడొచ్చావు నాన్న? ఏంటి ఆ కళ్ళలో నీళ్ళు” అని కంగారుగా అడిగాడు రాజేష్.

“ఏమి లేదయ్యా మీ తల్లి కొడుకుల ప్రేమ
చూస్తుంటే నాకింత మంచి కొడుకు, పెళ్ళాం దొరకడం నా అదృష్టం. అందుకే ఆనందంతో
కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి” అని రాజేష్ ను కౌగిలించున్నాడు రంగయ్య.
“బాబు ఎప్పుడు తిన్నావో ఏమో? కాళ్ళు,
చేతులు కడుక్కొని రా... వేడి వేడి బువ్వ తిందువు గానీ” అంది కనకమ్మ.
“సరే అమ్మ” అని పెరట్లోకి వెళ్ళాడు
రాజేష్.
రంగయ్య బకిట్లో నీళ్ళు ముంచి రాజేష్ ముందుంచాడు.
రంగయ్య బకిట్లో నీళ్ళు ముంచి రాజేష్ ముందుంచాడు.
“ఏంటి నాన్న నేను మీకు సేవ
చేయాల్సింది, అలాంటిది మీరు నాకు చేయడం ఏంటి?”.
“పర్వాలేదులేరా” చిన్నాగా నవ్వాడు
రంగయ్య.
“ఆహ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. ఏమి కూర వండవమ్మ” అని కనకమ్మ బదులివ్వకముందే “ఏదైనా సరే ఇవ్వాళ్ళ మా అమ్మ చేతి వంట ఓ పట్టు పట్టాల్సిందే” అంటూ ఉవ్విళ్ళూరాడు రాజేష్.
“ఆహ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. ఏమి కూర వండవమ్మ” అని కనకమ్మ బదులివ్వకముందే “ఏదైనా సరే ఇవ్వాళ్ళ మా అమ్మ చేతి వంట ఓ పట్టు పట్టాల్సిందే” అంటూ ఉవ్విళ్ళూరాడు రాజేష్.
అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి గడప దగ్గర నిలుచున్నా వెన్నెలను చూసి “ఏంటి వెన్నెల ఎప్పుడొచ్చావు? ఏంటి విషయం?” అడిగింది కనకమ్మ.
బుంగమూతి పెట్టి “అదేమి కాదు ఊరికే ఓసారి చూసి వెళ్దామని వచ్చా” చిలుకపలుకులు పలికింది వెన్నెల.
“నా కోసం వచ్చి అబద్దం ఆడతావా?నిన్నో
ఆటపట్టిస్తా చూడు” అని మనసులో అనుకుని పైకి మాత్రం “అమ్మా... వెన్నెల రోజు రాదూ
కదా, మరి ఈ రోజే ఎందుకు వచ్చినట్లు...” అన్నాడు అమ్మ చేతి గోరుముద్దలు తింటూ... వెన్నెలని
చూస్తూ ‘దీనికేం సమాధానం చెప్తావు’ అన్నట్లు బొమ్మ ఎగర వేసాడు.
“అదీ... అదీ...” కంగారుగా తడబడుతూ
అంది వెన్నెల.
“నన్ను చూడ్డానికి వచ్చి ఉంటుందమ్మా”
అన్నాడు రాజేష్.
వెన్నెలకి కోపం వచ్చింది.
“నేనేం నీ గురించి రాలేదు. మా కనకత్తను చూద్దామని వచ్చాను.” ధీమాగా కనకమ్మ భూజం మీద చేతులు వేస్తూ అంది వెన్నెల.
“నేనేం నీ గురించి రాలేదు. మా కనకత్తను చూద్దామని వచ్చాను.” ధీమాగా కనకమ్మ భూజం మీద చేతులు వేస్తూ అంది వెన్నెల.
మరుసటి రోజు ఉదయం తెల్లవారు జామునే
ఇంట్లోని పాతమంచాలు, కూర్చీలు తీసుకు వచ్చి భోగి మంటల్లో వేయసాగారు. చిన్న పిల్లలు
కర్రలు, సిర్రగోనే తీసుకు వచ్చి మంటల్లో వేశారు. యువకులంతా మామిడి తోటలోకెళ్ళి మామిడి
చెట్టెక్కి మామిడి ఆకును త్రుంచి ఇంటి ముందు తోరణాలు కట్టసాగారు.
అందరు కుంకుడుకాయ రసంతో స్నానం చేశారు.
రాజేష్ తలస్నానం చేయనంటే వెన్నెల, కనకమ్మ, రంగయ్య బలవంతంగా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించారు.
యువతులంతా పేడనీళ్ళతో వాకిలి అలికి రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను పేర్చారు.
హరినాథుడు చెక్క భజన చేస్తూ... వీధి వీధి తిరుగుతుంటే పిల్లలు అతని వెంట అల్లరి చేస్తూ తిరగసాగారు. గుడిలో పూజారి పూజ చేసి ప్రసాదం అందరికీ పంచాడు. అందరి ఇళ్ళలో సంక్రాంతి స్పెషల్ నువ్వుల పులగం చేశారు. పిల్లలందరూ వాటిని తీసుకుని పంటపొలాల్లో ఆడుకుంటూ తినసాగారు.
గంగిరేద్దులోడు గంగిరేద్దిని తీసుకుని పిచ్చయ ఇంటి ముందుకు వచ్చి అక్కడున్న రంగాన్ని చూసి అతని ఇల్లు అనుకుని “అయ్యగారు చల్లగుండాలే” అనగానే గంగిరెద్దు తల ఊపింది...
“అయ్యగారు ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది” అనగానే గంగిరెద్దు మళ్ళీ తలూపింది...
ఇంట్లోంచి పిచ్చయ్య మల్లి బయటకొచ్చారు...
రంగ సిగ్గుపడుతూ మల్లి వైపు చూపుతూ “ఇదిగో ఈమెనే నేను పెళ్లి చేసుకోబోయేది” పిచ్చయని చూపిస్తూ “అదిగో ఆయనే మా మావయ్య” గంగిరేద్దులోడికి చెప్పాడు.
గంగిరేద్దులోడు మనసులో ఇంకా ఏదైనా చెప్పి వాళ్ళ మెప్పుపొందాలనే తొందరలో “మీ మామ పేరు పిచ్చయ్య అయినా చాలా మంచోడు. పైగా వేరుశనగంతా పిచ్చి కూడా లేదు” అని నాలుక కరుచుకున్నాడు. ఇంతలో దానికి కూడా గంగిరెద్దు తల ఊపింది...
“సాల్ సాల్ లే నీ సోది” కోపంగా అని మల్లితో...
“మల్లి ఆ బియ్యం డబ్బా మీదున్న బట్టలు తెచ్చివ్వు” అని చెప్పి పొలంవైపు కదిలాడు పిచ్చయ్య.
గంగిరేద్దులోడు కనకమ్మ ఇంటి ముందుకొచ్చాడు.
“అమ్మగారు చల్లంగుండాలే... అమ్మా మీ ఇంట్లోకి మహలక్ష్మి రాబోతుంది” అన్నాడు గంగిరేద్దులోడు.
కనకమ్మ సంతోషంగా “ఎంత మంచి మాట చెప్పావు ఉండు” అంటూ ఇంటిలోకి వెళ్ళి రెండు దోసీల్లు బియ్యం తెచ్చి అతని సంచిలో పోసింది.

ఆ రోజు సాయంత్రం చెరకు తోటలో చెరకు
చెట్టుకు ఒరిగి వెన్నెల కోసం ఎదురుచూస్తున్నాడు రాజేష్. కాసేపటికి వెన్నెల
వచ్చింది .
“ఏంటీ వెన్నెల ఇంత లేటైంది?” అడిగాడు రాజేష్.
“అది సరేగాని నిన్న సాయంత్రం నీకోసం మీ ఇంటికొస్తే అత్తముందు నన్ను ఆటపట్టిస్తావా?” చిరు కోపంగా రాజేష్ బుగ్గగిల్లింది వెన్నెల.
“అది సరేగాని నిన్న సాయంత్రం నీకోసం మీ ఇంటికొస్తే అత్తముందు నన్ను ఆటపట్టిస్తావా?” చిరు కోపంగా రాజేష్ బుగ్గగిల్లింది వెన్నెల.
రాజేష్ ఆమె చేతుల్ని పట్టుకొని ఊపుతూ
ముందు కదిలాడు. ఆమె అడుగులు వెనక్కి వేస్తూ అతని కళ్ళలోకి సూటిగా చూడసాగింది.
అలాగే వెనక్కి వెళ్లి చెరకు చెట్టుకు ఒరిగారు.
“వెన్నెలా! పల్లెటూరి అందాలను తలపించే నీ చీరకట్టు. నాజూగ్గా
ఉండే నీ నడుము, అమాయకమైన నీ మోము” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు... వెన్నెల
సిగ్గు పడింది.
“మృదువైన నీ పాదాలకి మువ్వలు... పొడవైన నీ చేతులకి గాజులు... చెవులకి కమ్మలు చాలా అందంగా ఉన్నాయి.” అంటూ చెక్కిలి మీద ముద్దు పెట్టాడు. ఆమె ముక్కును గమనించి “అవును ఏంటి మొన్నటి వరకు ముక్కు పుడక ఉండేదిగా? ఏమైంది” ప్రేమగా ప్రశ్నించాడు రాజేష్.

వెన్నెల అతని చొక్కా గుండీలు తీస్తూ...
పెడుతూ “అదీ మొన్న స్నానం చేస్తుంటే ఎక్కడో పోయింది. ఈ విషయం ఇంకా మా నాన్నకి
తెలీదు” కొంచెం బాధపడుతూ చెప్పింది.
“పోనీలే... ఈ సారి నేను సిటీ నుంచి వచ్చేటప్పుడు నీకో మంచి ముక్కు పుడక తెస్తాను” అంటూ నిటారుగా ఉన్న ఆమె ముక్కుమీద ముద్దు పెట్టాడు.
వెన్నెలను తన కౌగిట్లో బందిచాడు. ఆమె సిగ్గుల మోగైంది.
“వెన్నెలా ఈ చేరకుకంటే నీ పెదాలే తియ్యగా ఉంటాయి... తెలుసా...” అంటూ పెదాలపై ముద్దు పెట్టాడు.
*****
“రఘునాథపల్లి దిగేవారు దిగండి” అన్న కండక్టర్ అరుపుతో రాజేష్ తన ఆలోచనలలోంచి బయటికొచ్చాడు. బస్సుదిగి తన స్నేహితులు కోసం చూసిన రాజేష్ కి ఎవ్వరు కనిపించకపోవడంతో ఒంటరిగానే ఊరి వైపు అడుగులు వేసాడు.
“ఏంటి ఊర్లో ఎవ్వరు కనిపించడం లేదు” అనుమానంగా మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.
బోసిగా ఉన్న తన ఇంటిని చూసి ఆ ఊరి సర్పంచ్ అయిన శంకరయ్య దగ్గరికెళ్ళి ఊర్లోవాళ్ల గురించి, తన వారి గురించి ఆరా తీసాడు రాజేష్.
“మీవాళ్ళే కాదు, పంటలు పండక చాలా మంది పట్నానికి వలస పోయారు. నీకోసం నిన్నటిదాకా క్రిష్ణగాడు చూసిచూసి నువ్వు రాకపోవడంతో వాడు కూడా వెళ్లిపోయాడు. అవును ఇన్ని రోజుల్నుంచి రాలేదే?” అని రాజేష్ ని ప్రశ్నించాడు సర్పంచ్.

“ఇప్పుడు నేను ఫైనలియర్ కదా! స్టడీస్ ఎక్కువగా ఉండటంతో
రాలేక పోయాను. అయినా నేను ఇంటికి రెగ్యులర్ గా లెటర్స్ రాస్తూనే ఉన్నాను. కాని
వీళ్ళు నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదు.
ఇంతకు వాళ్ళు సిటిలో ఎక్కడున్నట్లు?” అడిగాడు రాజేష్.
“ఏదో జీడిమేట్లంట బాబు” చెప్పాడు సర్పంచ్.
“సరే నేను మళ్ళీ సిటికి వెళ్తాను సంక్రాంతి అంటే సరదాగా సందడిగా ఉంటుందని ఆనందంగా గడపొచ్చని ఇక్కడికి వచ్చాను. కాని ఇక్కడి వాళ్ళంతా పంటలు లేక పట్నానికి వలస పోయారు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి తిరిగి మన ఊరికి తీసుకువస్తాను. అప్పుడే మన ఊరికి నిజమైన సంక్రాంతి” అని వెంటనే సిటీకి వెనుదిరిగాడు రాజేష్.
జీడిమెట్లలో బస్సు దిగి రెండు కిలోమీటర్లు నడిచిన స్లంమ్ ఏరియా వచ్చింది. చలి మంచుకన్నా గుడిసేల్లోంచి వస్తున్న పొగ దట్టంగా అలముకొని ఉంది. అతి కష్టం మీద వెన్నెల వాళ్ళ గుడిసెను తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు రాజేష్.
చిరిగినా బట్టలతో మసి అంటిన చేతులతో నొసలు మీద వాలిన వెంట్రుకలను పైకి లేపుకుంటూ “ఎవరు?” అంది వెన్నెల తన గుడిసె ఎదురుగా నిలబడి ఉన్న రాజేష్ ని సరిగా పోల్చుకోలేక.
“నేను రాజేష్ ను, ఏమిటి వెన్నెల ఎలా ఉండే దానివి? ఎలా అయిపోయావు? మన వాళ్ళంతా ఎక్కడున్నారు?” బాధాగా

అడిగాడు రాజేష్.
“నువ్వా రాజేష్... లోపలికిరా కూర్చో” ఆశ్చర్యపోతూనే అంది వెన్నెల.
“నువ్వా రాజేష్... లోపలికిరా కూర్చో” ఆశ్చర్యపోతూనే అంది వెన్నెల.
“అమ్మా వెన్నెల నువ్వు పనిచేసే ఇంట్లో
అయ్యగారు బట్టలు ఇస్తానన్నారు తీసుకొచ్చావా?ఒకే జతను మార్చిమార్చి వేసుకోవడం
కష్టమవుతుంది” అంటూ గుడిసెలోకి అడుగు పెట్టాడు పిచ్చయ్య.
ఎదురుగా ఉన్న రాజేష్ ని చూసి భావోధ్వేగానికి గురైయ్యాడు.
ఎదురుగా ఉన్న రాజేష్ ని చూసి భావోధ్వేగానికి గురైయ్యాడు.
“ఏంటి
పిచ్చయ్య ఒకప్పుడు గంగిరేద్దులోడికే బట్టలు దానం చేసిన నువ్వే
బట్టలు అడుక్కునే పరిస్థితికి వచ్చావా?” బాధగా, ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్.
“ఏం చెయ్యమంటావు రాజేష్ పట్నం వెళ్లి
ఏదో ఒక ఫ్యాక్టరీలో ఏదో ఓ చిన్న ఉద్యోగం చేయకపోతామా? అన్న ఆశతో మన ఊరోల్లంతా
పొట్టచేత పట్టుకుని పట్నానికి వచ్చాం. కాని తీర ఇక్కడికొచ్చాక తెలిసింది. ఎక్కడెక్కడి
నుంచో జనం మాలాగే ఇక్కడికి తరలి వచ్చారని.
ఇంతమంది రావడం వల్ల ఏ ఫ్యాక్టరీలో పని దొరక్కపోగా చివరకు తట్టమోసే కూలీలుగా, హోటల్లో
చిప్పలు కడిగే సర్వంట్లుగా, ఇంకొందరయితే ఏ పని దొరక్క రోడ్డు పక్కన బిచ్చగాళ్ళుగా
తయారయ్యారు. ఇందంతా మా తలరాత” బాధతో అన్నాడు పిచ్చయ్య.
గుడిసె బయటకి వెళ్లి ఉబికి వస్తున్న కనీళ్ళు
తుడుచుకున్నాడు పిచ్చయ. రాజేష్ అతని వెనుకే వెళ్లి భుజం మీద చేయి వేసి ఓదార్చాడు.
అప్పటికే మధ్యానం అయ్యింది అందరు తినడానికి వారివారి గుడిసెల దగ్గరికి వచ్చారు. అందరు రాజేష్ ని గమనించరు.
రాజేష్ వాళ్ళందరిని ఉద్దేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు.
అప్పటికే మధ్యానం అయ్యింది అందరు తినడానికి వారివారి గుడిసెల దగ్గరికి వచ్చారు. అందరు రాజేష్ ని గమనించరు.
రాజేష్ వాళ్ళందరిని ఉద్దేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు.
“మీలా గ్రామం వదిలి ఇలా పట్నాలకు వలసగా వచ్చి చాలామంది తప్పు
చేస్తున్నారు. * జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి * అన్నట్లు కన్నా తల్లిని, ఉన్న ఊరిని వదిలి రాకూడదు.
ఇలా రావడం వల్ల అటు పల్లెలు బీడుపడి పోతాయి. ఇటు పట్నాల్లో
కిక్కిరిసిన జనాభాతో జల, వాయు, కాలుష్యం ఎక్కువవుతుంది. స్థలం సరిపోక చాలా
అంతస్తులు కడుతూ విచ్చల విడిగా వేయిస్తున్న బోరు బావుల వల్ల భూగర్బ జలాలు అంతరించి
భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఉంది. జల, వాయు, వాతావరణ కాలుష్యం కారణంగా వింత వింత
భయంకర రోగాలు కలుగుతాయి. అధిక జనసాంద్రత కారణంగా నిరుద్యోగం పెరిగి ఆకలి చావులు చావాల్సి వస్తుంది. అందుకే మన ఊరికి
వెళ్లి పోదాం రండి” అన్నాడు రాజేష్.
“ అది సరే అక్కడ పంటల్లెకే కదా! మేమందరం ఇక్కడికి వచ్చాం. మళ్ళి తిరిగి వెళ్ళి ఎలా జీవించగలం.” సందేహించాడు పిచ్చయ్య.
“పనికి ఆహారం లాంటి పతకాలు ఉన్నాయి
కదా! మన చెరువులో పూడిక తీసి, రోడ్లు మరమ్మతులు చేసి
మొక్కలను నాటి పెంచి మన గ్రామాన్ని ఒక నందన వనంగా మార్చవచ్చు. కష్టమో నష్టమో మన
ఊరిలో ఉంటూ సమిష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేద్దాం. రైతే రాజు అన్నట్లు రైతు
ఎప్పుడు రాజుగానే ఉండాలి. అందుకే మనమందరం ఈ రోజే మన ఊరికి వేల్లిపోదం రండి” అందరికి
ఆవగాహన కలిగేల చెప్పాడు రాజేష్.
“అవును రాజేష్ నువ్వు చెప్పింది నిజమే.
మనమందరం మన ఊరికి వెళ్ళిపోదాం పదండి” అక్కడ గుమికూడిన తమ ఊరి వారిని ఉద్దేశించి అంది
మల్లి.
“మనం కూడా మన ఊరికి వెళ్దాం పదండి రా”
అన్నారు ఇతర గ్రామస్తులు.
అందరు మూటలు సర్దుకుని తమ తమ ఊర్ల కు వెళ్లి పోయారు.
అందరు మూటలు సర్దుకుని తమ తమ ఊర్ల కు వెళ్లి పోయారు.
ఆ మరుసటి దినం అక్కడ చలిమంచు తప్ప...
పొగ మచ్చుకైనా లేదు...
*** జైహింద్ ***
writer email id: risingstar4tomorrow@gmail.com
పొగ మచ్చుకైనా లేదు...
*** జైహింద్ ***
writer email id: risingstar4tomorrow@gmail.com
super concept
ReplyDelete