రవీంద్రభారతి 19-07-2015
తెలంగాణ నాటక రంగం - తెలంగాణా కళ ప్రస్థానం
సుచరిత రామానుజపురం (Ph. D.)
నా తెలంగాణా కోటి రతనాల వీణ
తెలంగాణ కళా నాటక రంగాన్ని సుసపన్నం చేసిన కళాకారులకు కోటి దండాలు
స్వరంతో , నటనతో , నాట్యంతో కళ రంగానికి సప్త వర్ణాల సొబగులు అద్దిన మహామహుల
మహోజ్వల తెలంగాణా నా పుణ్యభూమి ... ధన్యభూమి.
ఎందరో కళాకారులు తెలంగాణా గడ్డమీద గజ్జకట్టి నటరాజుకి నీరాజనం పలికారు. నాటకరంగాన్ని నవ్యపథం వైపు నడిపించారు ... కళకళలాడించారు .
ఒకప్పుడు తెలంగాణాలో నాటకరంగం ఫరిఢవిల్లింది. అపట్లో ప్రజలకు కాలక్షేపం నాటకమే సామాజిక స్ప్రుహగల అంశాలు , స్వాతంత్ర్యోద్యమ్మంలో స్పూర్తిని కలిగించే నాటకాలు ప్రజల కొరకు , ప్రజల మధ్య ప్రధార్శించాబడ్డాయి. కళాకారులు నాటకాన్ని వృత్తిగా స్వీకరించిన, పరితోశకం మాత్రము అందలేదు, వారు అంతగా ఆశించలేదు. వాళ్ళలోని నటనా తృష్ణ ఒక తీరని దాహంగా తపనకు పరాకాష్టగా మిగిలింది.
చతుర్విదభినయాలతో ప్రజలను రంజింపచేయడానికి స్పూర్తిని కలిగించడానికి నాటకరంగాన్ని ఒక మాధ్యమంగా ఎన్నుకొన్నారు, ఒక ఆశయంగా భావించారు.
రాజకారుల మీద కొనసాగిన సాంస్కృతిక పోరాటంలో నాటకం ప్రముఖ పాత్ర వహించిన కారణంగా దొరలచే , నైజం ప్రభుత్వంచే అణిచివెతకు గురైంది, కళాకారులు హింసించబడ్డారు. దొరల నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన నాటకాలు , ఒక సామాజిక బాధ్యతను బ్రతికించాయి.
భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా నైజాం ఏలుబడిలో ఉన్న మన తెలంగాణా రాష్టాన్ని విలీనం చేసుకుంది. ఆ స్వేచ్చ , స్వాతంత్ర్యం దొరికింది అన్న ఆనందం పట్టుమని పదికాలాలపాటు నిలవకముందే ఆంధ్ర రాష్టంలో విలీనం చేసి మళ్లి పారాయి పాలనకు తెర తీసింది. సుధిర్ఘంగా సాగిన తెలంగాణా పోరాటంలో ఎంతోమంది బలియ్యారు , చివరకు __ (19 - 2013) ఇన్నేళ్ళ తర్వాత తెలంగాణా సాదించింది. నైజాం చేర నుండి బయటపడిన తెలంగాణా ప్రజలు ఆంద్ర పాలకుల వలలో చిక్కి నిరాదారణకు గురైయ్యారు. అయినప్పటికీ వివిధ రూపాలలో తన శక్తి , సత్తాను చాటుతూ తన ఉనికిని కాపాడుకుంది. నైజాం ప్రభుత్వం అణిచివెతకు ఆంద్ర పాలకుల వివక్షకు చిక్కి శల్యమైంది.
ఇదిలా ఉండగా మరోపక్క T.V. మాధ్యమం , సినిమారంగం , మల్టీప్లెక్స్ ల కల్చర్ , నాటకరంగ తిరోగమనానికి తల ఒక చేయి వేసాయి. నాటక కళాకారులు విధిన పడిన దుస్థితి వచ్చింది.
* ఆర్ధిక పరమైన ప్రోత్సాహం లేకపోవడం ముఖ్య కారణం.
కొసమెరుపు :
ఒక చిన్న ఆశ కిరం వేణవేల వెలుగులతో నాటక రంగాన్ని తేజోమయం చేస్తుందన్న నమ్మకానికి తెలంగాణా ప్రభుత్వం ఒక సాక్షి సంతకంగా మారనుంది. నాటకరంగాన్ని ప్రోత్సహించడం. తెలంగాణా సాంస్కృతిక విభాగాన్ని మరింత ఆరోగ్యంగా తీర్చిదిద్ధడానికి ప్రయత్నించడం ఆశావాద దృక్పథాన్ని సూచిస్తున్నాయి.
తెలంగాణా ప్రత్యేక రాష్టంగా ఏర్పడిన శుభ సందర్బంలో సంబురాలు జరుపుకుంటున్న వేళ, నాటక రంగం తన పూర్వ ప్రాభవాన్ని సంపాదించుకుంటుంది అని ఆశిద్దాం.
తెలంగాణా నాటక రంగానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటుంది అని పూర్తి విశ్వాసం ఉంది.
Objects:
1. తెలంగాణా కళాకారులకు, వారి కుటుంబాలకు ఉచిత భోజన వసతులు కల్పించాలి.
2. ఒక్కొక్క కళాకారులకు కనీసం ఒక్క గది అయిన కట్టించి ఇవ్వాలి.
3. కాలుష్యం , పర్యావరణం , ఉగ్రవాదం , నిరుద్యోగం లాంటి సామాజిక సమస్యలపై నాటకాలను ప్రదర్శించడం.
4. నైపుణ్యం కలిగిన కళాకారులకి నాటక ప్రదర్శనంలో అవకాశం కలిగించడం.
5. నాటకరంగ కళాకారుల పిల్లలకు ఉచిత విద్యను ఏర్పాటు చేయడం.
6. కళాకారులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యాలు కలిపించడం.
7. నాటక రంగ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కలిగించడం.
8. ముఖ్యంగా మహిళా కళాకారులకు అన్ని నాటక రంగ విభాగాలలో తర్ఫీదును ఇచ్చే గురుకులాలను ఏర్పాటు చేయాలి.
ఇలాంటి ఆశయాలతో ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేయాలి.
చాల దేవాలయాలకు మాన్యాల పేరిట భూములు ఉంటాయి. వాటి మీద వచ్చే ఆదాయాలతో దేవాలయాలు స్వయముగా నిర్వహించాబడుతుంటాయి. ఒకవేళ భక్తులు దక్షిణ ఇచ్చినా , ఇవ్వక పోయిన గుడి కార్యక్రమాలకు, అర్చకుల జీతభత్యాలకు కొదువ లేకుండా మాన్యాలమీద వచ్చే ఆదాయముతో నిర్విఘ్నముగా నిర్వహించాబడుతుంటాయి. కళా ప్రదర్శనలతో సకల జనాలను సజ్జనులుగా మార్చే ఈ ధార్మిక సంస్థకు కూడా దేవాదాయ మాన్యాల వలె భూములను సమ కూర్చాలి. అప్పుడే నిరంతరమూ నిజమైన కళాకారులతో సామాజిక ప్రయోజనార్తమైన నాటకాలను ప్రదర్శించి, సౌఖ్య మరియు సంక్షేమ సమాజమును ఏర్పాటు చేయగలుగుతాయి . అందుకే ఇలాంటి ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి స్వయంప్రతిపత్తితో మనగలిగింపజేయు, స్వయంపోషక స్థితిని కల్పించుటకై , స్థిరచరాస్తులను సమకుర్చాలి .
No comments:
Post a Comment